6th July 2026

__________

- Saidulu

రోజూవారి ఆహార పదార్థాల్లో కల్తీని సులభంగా గుర్తించే చిట్కాలు.. 

మనం రోజూ తినే ఆహారంలో కల్తీని ఇంట్లోనే సులభంగా గుర్తించే అద్భుతమైన చిట్కాలు మీకోసం.

ఒక చుక్క పాలను నిలువుగా ఉండే బండపై వేయండి. నెమ్మదిగా జారితే స్వచ్ఛంగా ఉండే అవకాశం ఎక్కువ, వెంటనే పారితే నీరు కలిసివుండొచ్చు.

పాలలో కల్తీని ఎలా గుర్తించాలి?

గ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా పసుపు వేసి కదపకుండా ఉంచండి. పసుపు కిందకు చేరి, నీరు స్పష్టంగా ఉంటే అది అసలైనది.

పసుపు నాణ్యత

కొన్ని మిరియాలను నీటిలో వేయండి. గట్టిగా ఉండే మిరియాలు అడుగుకు చేరుతాయి. బొప్పాయి గింజలు అయితే నీటిపై తేలుతాయి.

మిరియాల్లో బొప్పాయి గింజల కల్తీ

ఒక గ్లాసు నీటిలో చెంచా తేనె వేయండి. అది కరగకుండా కిందకు చేరితే స్వచ్ఛమైనది. నీటిలో త్వరగా కరిగితే అది కల్తీ తేనె.

తేనెలో బెల్లం పాకం?

ఒక గ్లాసు నీటిలో చెంచా కారం వేయండి. ఇటుక పొడి ఉంటే అది గ్లాసు అడుగున పేరుకుపోతుంది. రంగు మారితే కృత్రిమ రంగులున్నట్లే.

కారం పొడి

ఒక చెంచా నెయ్యిలో కొద్దిగా అయోడిన్ కలపండి. అది నీలం రంగులోకి మారితే అందులో బంగాళాదుంప స్టార్చ్ కలిపారని అర్థం.

నెయ్యి స్వచ్ఛమైనదేనా?

ఆకుకూరలను కొద్దిగా నీటిలో నానబెట్టినప్పుడు రంగు మారినా, లేదా పత్తితో తుడిచినప్పుడు రంగు అంటుకున్నా మలాకైట్ గ్రీన్ వాడినట్లే.

కూరగాయలపై రసాయనాలు!

ఒక గ్లాసు నీటిపై కాఫీ పొడిని చల్లండి. కాఫీ పొడి పైన తేలుతుంది, కానీ చిక్కోరి పొడి నీటిని పీల్చుకుని కిందకు మునుగుతుంది.

కాఫీ పొడి