ఆమ్ ఆద్మీకి ‘‘బూస్ట్’’… స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం
రాష్ట్ర ఎన్నికలకు సరిగ్గా యేడాది మాత్రమే వున్న సమయంలో పంజాబ్ లో అధికారంలో వున్న ఆమ్ ఆద్మీ కష్టకాలాన్ని ఎదుర్కొంటోంది. ఇంతటి కష్ట కాలంలో ఆమ్ ఆద్మీకి కొంత భరోసా లభించింది. హోషియార్ పూర్, జలాలాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్ ఘన విజయం సాధించింది. దీంతో కొంత ఊపిరి పీల్చుకున్నట్లైంది. దీంతో కేడర్ లో కొంత ఆత్మ విశ్వాసం పెరిగింది.
హోషియార్ పూర్ మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 50 స్థానాలకు గాను 35 స్థానాల్లో ఆప్ ఘన విజయం సాధించింది. ఇక.. కాంగ్రెస్ 9 స్థానాలను, బీజేపీ కేవలం 3 స్థానాలను మాత్రమే గెలుచుకుంది. మిగిలిన మూడింటిలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.
జలాలాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) 12 స్థానాలను గెలుచుకుంది. విశేషమేమిటంటే, జలాలాబాద్ ప్రాంతం శిరోమణి అకాలీ దళ్ (SAD) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు కంచుకోటగా పరిగణించబడుతుంది; 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఇక్కడే ప్రస్తుత ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌ను ఓడించారు. అయితే, 2022 పంజాబ్ ఎన్నికల్లో మాత్రం బాదల్, AAP అభ్యర్థి జగ్దీప్ కాంబోజ్ చేతిలో ఓటమి పాలయ్యారు.
ఇవి కూడా చదవండి
ఈ కీలకమైన రెండు మున్సిలప్ స్థానాల్లో ఆప్ విజయం సాధించడంతో కార్యకర్తలు ఆనందోత్సవాలు చేసుకున్నారు. తమ నాయకత్వంపై ప్రజలకు అపారమైన నమ్మకం వుందని, ఇదే నిదర్శనమని పార్టీ కేడర్ పేర్కొంది.
ఈ ఏడాది మే నెలలో పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆప్ (AAP) ఘనవిజయం సాధించి, 48 శాతానికి పైగా మున్సిపల్ వార్డులను కైవసం చేసుకుంది. పంజాబ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) వివరాల ప్రకారం, మొత్తం 1,977 వార్డులలో అధికార పార్టీ 954 వార్డులను గెలుచుకుంది.రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ 393 వార్డులను గెలుచుకుని, చాలా వెనుకబడి రెండో స్థానంలో నిలిచింది. అకాలీ దళ్ 192 వార్డులను గెలుచుకోగా, బీజేపీ 172 వార్డుల్లో విజయం సాధించిందని రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.
చిక్కుల్లో వున్న ఆమ్ ఆద్మీకి బూస్ట్
ఈ యేడాది మే మాసంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ చిక్కుల్లో ఇరుక్కున్నారు. సీఎం భగవంత్ మాన్ అసెంబ్లీకి తాగి వచ్చారని ఆరోపణలు వచ్చాయి. మేడే ప్రత్యేక సమావేశలకు మద్యం మతత్తులో వచ్చారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అందరికీ బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలని డిమాండ్ కూడా చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్.. పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. సిక్కు గురువుల చిత్రపటాలపై భగవంత్ మాన్.. మద్యం చల్లుతున్నట్లుగా ఉన్న వీడియో వైరల్‌గా మారడంతో దుమారం రేపింది. దీనిపై సిక్కు మత సంఘాలతో పాటూ విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి.








