చైనా మొబైల్ యాప్ ను నిషేధించిన కేంద్రం…
చైనా మొబైల్ యాప్ లపై కేంద్రం కొరడా ఝుళిపించింది. ఢిల్లీో ఈ – రిక్షాలను రిమోట్ ద్వారా ఆపేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న మొబైల్ యాప్ లను కేంద్రం నిషేధించింది. వీటిని గూగుల్ ప్లేస్టోర్, ఆపిల్ యాప్ స్టోర్ నుంచి తక్షణమే తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ – రిక్షాలను నడిరోడ్డుపై షట్ డౌన్ చేస్తున్నట్లు వీడియోలు చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ యాప్స్ ను తొలగించింది.
అసలు వివాదం ఏమిటంటే…
ఢిల్లీలో ఈ- రిక్షా డ్రైవర్లను, డీలర్లను ఈ యాప్ లు ముప్పు తిప్పుల పెడుతున్నాయి. ఈ రిక్షాల బ్యాటరీ మేనేజ్ మెంట్ సిస్టమ్స్ లోని వోల్టేజ్, ఉష్ణోగ్రత, కరెంట్ వంటి వివరాలను తెలుసుకోవడానికి BAT-BMS వంటి చైనీస్ మొబైల్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. దీనికి ఎలాంటి పాస్ వర్డ్, సెక్యూరిటీ అథంటికేషన్ లేదు. బ్లూటూత్ రేంజ్ లో వున్న వారు ఎవరైనా సరే ఆపరేట్ చేస్తారు. అలాగే ఒక్క ట్యాప్ తో వాహనానికి పవర్ సప్లయ్ కాకుండా నిలిపేయవచ్చు కూడా.
అయితే.. రోడ్డుపై వెళ్తున్న ఈ రిక్షాలను యాప్ ద్వారా రిమోట్ గా ఆఫ్ చేస్తూ డ్రైవర్లను ఇబ్బందులు పెడుతోంది. తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేస్తున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇలాంటి ప్రమాదకర యాప్లు ప్రజలకు అందుబాటులో ఉండకుండా చర్యలు తీసుకుంటామని కేంద్రం తెలిపింది. భవిష్యత్తులో కూడా ప్రజల భద్రతకు ముప్పుగా మారే యాప్లను గుర్తించి యాప్ స్టోర్ల నుంచి తొలగించే చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.








