పెళ్లిళ్లు, పండుగ ఏదైనా సరే, ప్రతి అమ్మాయి మనసు దోచే సార్వకాలిక రాచరికపు ఫ్యాషన్... మన "అనార్కలి" దుస్తులు!
ప్రస్తుతం రోజ్ గోల్డ్, ప్లాటినం సిల్వర్ వంటి మెటాలిక్ రంగుల అనార్కలీలు కాక్టెయిల్ పార్టీలలో ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్నాయి.
మెటాలిక్ గ్లో ట్రెండ్
గ్రాండ్ లుక్ కోసం ఎమరాల్డ్ గ్రీన్, వైన్ రెడ్ వెల్వెట్ ఫ్యాబ్రిక్‌పై జర్దోసీ వర్క్ ఉన్న అనార్కలీలు బాగా పాపులర్.
రాయల్ వెల్వెట్
బరువు లేకుండా, చాలా క్లాసీగా కనిపించాలనుకునే వారి కోసం ఫ్లోరల్ ప్రింట్స్ ఉన్న ఆర్గాంజా అనార్కలీలు బెస్ట్ ఛాయిస్.
లైట్ వెయిట్ ఆర్గాంజా
ఈ మధ్యకాలంలో పౌడర్ బ్లూ, మింట్ గ్రీన్, బ్లష్ పింక్ వంటి పేస్టల్ షేడ్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.
పేస్టల్ కలర్స్
సాంప్రదాయ అనార్కలిపై లాంగ్ లేదా షార్ట్ ఎంబ్రాయిడరీ జాకెట్ వేసుకోవడం ఇప్పడు సరికొత్త ఇండో-వెస్ట్రన్ లుక్ ఇస్తోంది.
జాకెట్ స్టైల్ అనార్కలి
చురీదార్‌తో పనిలేకుండా సింగిల్ పీస్ లాగా నేలకు తాకేలా ఉండే అనార్కలి గౌన్స్ రిసెప్షన్లకు పర్ఫెక్ట్‌గా సరిపోతాయి.
ఫ్లోర్ లెంగ్త్ గౌన్స్
కుర్తా మధ్యలో లేదా పక్క భాగంలో లాంగ్ కట్ (స్లిట్) వచ్చే డిజైన్స్ మోడ్రన్ ఫ్యాషన్ లవర్స్‌కు నచ్చుతున్నాయి.
హై-స్లిట్ డిజైన్స్
అనార్కలిపై దుపట్టాకు బదులుగా షీర్ కేప్స్ వాడటం లేదా నడుముకి వెస్ట్రన్ బెల్ట్ పెట్టడం లేటెస్ట్ ట్రెండ్.
బెల్ట్ & కేప్ స్టైల్స్
హెవీ అనార్కలి వేసుకున్నప్పుడు పెద్ద జుమ్కాలు పెట్టుకుని, సింపుల్ హెయిర్ స్టైల్ ఫాలో అయితే మీ లుక్ అదిరిపోతుంది!