రామ్ చరణ్ డ్రీమ్ ఫామ్‌హౌస్ రెడీ!
రామ్ చరణ్(RAM charan) హీరోగా మాత్రమే కాదు, బిజినెస్‌మ్యాన్ గా కూడా తన ప్రత్యేక గుర్తింపును మరింత బలపరుచుకుంటున్నారు. సినిమాలతో పాటు పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టిన ఆయన, ఇప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉండే జీవనశైలిపై కూడా దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలోని చెవెళ్ల–మోకిలా మధ్య ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన ఐదు ఎకరాల భూమిని అత్యాధునిక ఫామ్‌హౌస్‌గా చరణ్ డెవలప్ చేసినట్లు సినీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. సిటీ లైఫ్ కు దూరంగా ప్రశాంత వాతావరణంలో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనే ఆలోచనతో ఈ ప్రాజెక్ట్‌ను రూపొందించినట్లు సమాచారం.
ఈ ఫామ్‌హౌస్ నిర్మాణంలో విలాసవంతమైన సౌకర్యాలతో పాటు సహజ వాతావరణానికి ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంటీరియర్ డిజైన్ కోసం ప్రముఖ డిజైనర్ల సేవలు తీసుకున్నట్లు, ప్రతి విభాగాన్ని ప్రత్యేక కాన్సెప్ట్‌తో తీర్చిదిద్దినట్లు సమాచారం. నిర్మాణ పనులు పూర్తయ్యాయని, త్వరలోనే గృహప్రవేశ కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో నిర్వహించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఫ్యూచర్ లో ఆర్గానిక్ ఫార్మింగ్ మొదలుపెట్టాలనే ఆలోచన కూడా చరణ్ కు ఉందని ప్రచారం సాగుతోంది.
ప్రస్తుతం భారీ సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్, షూటింగ్‌ల మధ్య దొరికే బ్రేక్ ను ఫ్యామిలీకి కేటాయించడానికే ఈ ఫామ్‌హౌస్ ప్రధాన వేదికగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా భార్య ఉపాసన(Upasana), పిల్లలతో కలిసి ప్రశాంత వాతావరణంలో సమయం గడిపేందుకు ఈ ఫామ్ హౌస్ ఉపయోగపడనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.








