గోల్డ్ కలర్ డ్రెస్ లో పుత్తడి బొమ్మలాగా మెరిసిపోతున్న జాన్వీ
అతిలోక సుందరి శ్రీదేవి(Sridevi) కూతురిగా ఇండస్ట్రీకి పరిచయమైన జాన్వీ కపూర్ తక్కువ టైమ్ లోనే తనదైన గుర్తింపు తెచ్చుకుంది. సోషల్ మీడియాలో తన ఫ్యాషన్ సెన్స్ తో ఎప్పటికప్పుడు హల్చల్ చేసే జాన్వీ తాజాగా గోల్డ్ కలర్ మెటాలిక్ బ్లౌజ్, మ్యాచింగ్ స్కర్ట్ లో అదరగొట్టే అందాలతో ఆకట్టుకుంటుంది. డ్రెస్ కు తగ్గట్టుగా జాన్వీ మేకప్ అయిన తీరు, ధరించిన ఆభరణాలు తన లుక్ ను మరింత ఎలివేట్ చేయగా, ఈ డ్రెస్ లో ఆమెను చూసిన కుర్రాళ్లు జాన్వీ బంగారు బొమ్మలా మెరిసిపోతుందంటూ కామెంట్స్ చేస్తూ ఆ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తున్నారు.








