ఆటా మహాసభల్లో ‘శ్రీ శివ పార్వతుల కళ్యాణం’!
అమెరికన్ తెలుగు సంఘం (ATA) ఈ ఏడాది నిర్వహించనున్న 19వ కాన్ఫరెన్స్ & యూత్ కన్వెన్షన్లో భాగంగా, చారిత్రక ఆధ్యాత్మిక వేడుకకు సిద్ధమైంది. ‘శ్రీ శివ పార్వతుల కళ్యాణాన్ని’ అత్యంత వైభవంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించేందుకు ఆధ్యాత్మిక కమిటీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భారత్ నుండి ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఉత్సవ మూర్తుల సమక్షంలో, శ్రీశైలం దేవస్థానం మార్గదర్శకత్వంలో ఈ దివ్య కళ్యాణం జరగనుంది.
ఆగస్టు 2, 2026న బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో ఉదయం 8:30 నుండి 11:30 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొని, శివ పార్వతుల ఆశీస్సులు పొందాలని ఆటా ఆధ్యాత్మిక కమిటీ తెలుగు వారందరికీ పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగా భక్తులు వివిధ రకాల స్పాన్సర్షిప్ సేవల ద్వారా కూడా భాగస్వాములు కావచ్చు.
ఇందులో కళ్యాణం గ్రాండ్ స్పాన్సర్షిప్ ($25,000), కన్యా దానం స్పాన్సర్స్ ($2,500), గిరిజా మంగళ్యం స్పాన్సర్స్ ($2,500), కళ్యాణ పులమాలలు, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్పాన్సర్స్ ($1,116 చొప్పున), కళ్యాణం పసుపు కుంకుమ స్పాన్సర్స్ ($516), సామూహిక కళ్యాణోత్సవం ($250) వంటి ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.
మరింత సమాచారం , రిజిస్ట్రేషన్ కోసం ataconference.org/Registration/Spiritual-kalyanam వెబ్సైట్ను సందర్శించవచ్చు. ఈ వేడుకను విజయవంతం చేసి, మన సంప్రదాయాలను ప్రపంచ వేదికపై సెలబ్రేట్ చేసుకుందామని కమిటీ కోరింది. ఈ కార్యక్రమం గురించి ఏవైనా సందేహాలు ఉంటే, ఆధ్యాత్మిక కమిటీ చైర్ కమలాకర్ను (443) 636-0628 నంబర్లో సంప్రదించవచ్చు.








