దుబాయ్ తెలంగాణ ప్రతినిధులతో కేటీఆర్ భేటీ..
దుబాయ్లో నివసిస్తున్న తెలంగాణ ప్రవాస ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని మర్యాదపూర్వకంగా కలిసి, దుబాయ్లో తెలంగాణ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించాలని ఆహ్వానించారు.
గతంలో అమెరికాలోని డల్లాస్, మలేషియా తదితర దేశాల్లో తెలంగాణ ప్రవాసులతో విజయవంతంగా నిర్వహించిన సమావేశాల తరహాలోనే, దుబాయ్లో కూడా తెలంగాణ ప్రజలు, బీఆర్ఎస్ అభిమానులు, ప్రవాస తెలంగాణవారితో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలని ప్రతినిధులు కేటీఆర్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసులను ఒకే వేదికపైకి తీసుకువచ్చే కార్యక్రమాలను మరింత విస్తృతంగా నిర్వహించాలని ప్రతినిధులు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేష్ బిగాల, దుబాయ్ ప్రతినిధుల తరఫున కిరణ్ పీచర, రాధారపు సత్యం, సుధాకర్ రెడ్డితో పాటు పలువురు ప్రవాస ప్రముఖులు పాల్గొన్నారు.








