సింగరేణిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై : కిషన్ రెడ్డి
సింగరేణి నష్టాల బారిన పడటానికి కారణం బిఆర్ఎస్, కాంగ్రెస్ (Congress) పార్టీలే కారణమని కేంద్ర బొగ్గు గనులశాఖ మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా భూపాలపల్లిలో కిషన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో బిఆర్ఎస్ (BRS), పార్టీ నేతలు సింగరేణి (Singareni) శ్రమను పదేళ్లపాటు దోచుకున్నారని విమర్శించారు. కార్మికులకు ఇవ్వాల్సిన రూ.54 వేల కోట్ల బకాయిలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పణంగా పెట్టి సింగరేణి కార్మికులు పనిచేస్తున్నారన్నారు. సింగరేణిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.








