టీటీడీకి మరో భారీ విరాళం
టీటీడీకి మరో భారీ విరాళం అందింది. టీటీడీ బర్డ్ ట్రస్ట్ (TTD BIRRD Trust)కు రూ.4.41 కోట్ల విరాళం అందింది. హైదరాబాద్కు చెందిన ఆర్ఎస్ బ్రదర్స్ రీటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థ ఈ విరాళం అందజేసింది. ఆర్ఎస్ బ్రదర్స్ (RS Brothers) రిటైల్ ఇండియా లిమిటెడ్ ఛైర్మన్ పొట్టి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ( BR Naidu)ను కలిసి విరాళానికి సంబంధించిన డీడీని అందజేశారు. ఈ సందర్భంగా వారిని టీటీడీ ఛైర్మన్ అభినందించారు. ఈ విరాళం బర్డ్ ట్రస్టు ఆధ్వర్యంలో వికలాంగులకు అందిస్తున్న వైద్య (Medical), పునరావాస సేవలు మరింత విస్తృతంగా కొనసాగేందుకు తోడ్పాటుగా నిలుస్తుందని అన్నారు.








