15th July 2026

__________

- Saidulu

వేడి అన్నంలో నెయ్యితో తింటే నోరూరించే పండు మిర్చి పచ్చడి!

వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఘాటైన పండు మిర్చి పచ్చడి వేసుకుని తింటే ఆ రుచే వేరు! ఆంధ్రా స్టైల్ పచ్చడిని ఇలా చేయండి.

నోరూరించే పండు మిర్చి పచ్చడి!

అర కిలో తాజా పండు మిరపకాయలు, వంద గ్రాముల చింతపండు, తగినంత ఉప్పు, ఆవాలు, మెంతులు మరియు వేరుశెనగ నూనె సిద్ధం చేసుకోండి.

కావలసిన పదార్థాలు

పండు మిరపకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా కాటన్ గుడ్డతో తుడిచి, ఫ్యాన్ కింద పూర్తిగా ఆరబెట్టడం చాలా ముఖ్యం.

మిరపకాయలు ఆరబెట్టడం

చింతపండులోని గింజలు, పీచును పూర్తిగా తీసేయండి. తడి తగలకుండా పొడిగా ఉంచుకోవడం వల్ల పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.

చింతపండు సిద్ధం చేయడం

ఒక చెంచా మెంతులు, రెండు చెంచాల ఆవాలను నూనె లేకుండా దోరగా వేయించి, చల్లారాక మిక్సీ పట్టి మెత్తని పొడిలా చేసుకోండి.

మసాలా పొడి

మిక్సీ జార్‌లో పండు మిరపకాయలు, ఉప్పు, చింతపండు వేసి కచ్చాపచ్చాగా (బరకగా) గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి.

పచ్చడి రుబ్బడం

గ్రైండ్ చేసిన పండు మిర్చి మిశ్రమంలో ముందుగా సిద్ధం చేసుకున్న ఆవ-మెంతి పొడి వేసి పిండిని బాగా మిక్స్ చేయండి.

మసాలా కలపడం

కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఇంగువ వేసి దోరగా తాలింపు పెట్టండి.

కమ్మని తాలింపు

వేయించిన తాలింపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో వేసి బాగా కలపాలి. దీనివల్ల పచ్చడి రంగు మారకుండా ఉంటుంది.

పోపు మిక్సింగ్

అంతే! ఎంతో రుచికరమైన పండు మిర్చి పచ్చడి రెడీ. అన్నం, ఇడ్లీ, దోశల్లోకి ఇది అమృతంలా ఉంటుంది. ఇప్పుడే ట్రై చేయండి!