టిజి 20 ఛాంపియన్ గా కలల అరంగేట్రాన్ని చేసిన హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్
ప్రతి విజయవంతమైన సీజన్లోనూ కొన్ని కీలకమైన ఘట్టాలు ఉంటాయి. హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ అంతకంటే అద్భుతమైనదాన్ని సృష్టించారు. నిలకడను తమ అతిపెద్ద బలంగా మార్చుకుని ఈ సీజన్ విజేతలుగా నిలిచారు.
అజేయమైన లీగ్ ప్రదర్శనతో, టిజి 20లో అత్యంత క్రమశిక్షణ కలిగిన జట్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. అప్పుడప్పుడు మెరుపులు సృష్టించటం కాకుండా, వారు ప్రతి వారం అత్యుత్తమ ప్రదర్శనలు ఇచ్చారు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ఆత్మవిశ్వాసంతో పోరాడారు. ఆ నిలకడ నాకౌట్ దశల్లో కూడా కొనసాగింది. అక్కడ ప్రశాంతమైన నిర్ణయాలు, సమష్టి ప్రదర్శన హైదరాబాద్‌కు ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకోవడంలో సహాయపడ్డాయి.
కెప్టెన్ అభిరత్ రెడ్డి ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడంతో బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం చేకూరింది. పర్పుల్ క్యాప్ విజేత అజయ్ దేవ్ గౌడ్, టోర్నమెంట్ అంతటా బంతితో హైదరాబాద్‌ను అత్యుత్తమంగా నిలబెట్టాడు. అంతే అద్భుతమైన ప్రదర్శనలను ప్రణవ్ వర్మ, ఎం.ఏ. షణ్ముఖ్, వైష్ణవ్ రెడ్డి, గణేష్ గడుగులు చేయటం తో పాటుగా వారందించిన ఫినిషింగ్ సహకారం కూడా ఎంతో విలువైనది. ఒత్తిడిలో రాణించగల వారి సామర్థ్యం పదేపదే మ్యాచ్‌లను హైదరాబాద్‌కు అనుకూలంగా మార్చింది.
ఈ ఛాంపియన్షిప్, ఫ్రాంచైజీ సంస్కృతికి కూడా ప్రతిబింబం. ప్రతి ఆటగాడు తమ బాధ్యతను అర్థం చేసుకుని, దానిని స్వీకరించి జట్టు విజయానికి దోహదపడ్డారు.
రామోజీ గ్రూప్, లక్ష్య స్పోర్ట్స్ ఎకోసిస్టమ్ మద్దతుతో, హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ మైదానంలో అద్భుత ప్రదర్శనతో పాటు దీర్ఘకాలిక అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యతనిచ్చారు. ఈ టైటిల్ ఆ తత్వాన్ని ధృవీకరించింది. ప్రతిభ, సన్నద్ధత , టీమ్ వర్క్ పై పెట్టుబడి పెట్టడం వల్ల కలిగే ప్రభావాన్ని వెల్లడించింది.
టిజి 20 తొలి ఛాంపియన్లుగా, హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ కేవలం క్రీడా విజయం కంటే ఎక్కువే సాధించారు. వారు లీగ్ భవిష్యత్ ఎడిషన్లకు ఒక ప్రమాణాన్ని నెలకొల్పారు. ఆధునిక క్రికెట్లో నిలకడ అనేది అత్యంత విలువైన లక్షణాలలో ఒకటిగా నిలుస్తుందని నిరూపించారు.
ఛాంపియన్లు గెలిచినందుకు గుర్తుండిపోతారు. గొప్ప జట్లు గెలిచినా విధానం వల్ల గుర్తుండిపోతాయి. హైదరాబాద్ ఇ-ఛాంపియన్స్ ఈ రెండింటి వల్ల ఎప్పటికీ గుర్తుండిపోతారు.








