హైకోర్టులో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు ఊరట
రాజధానిలోని అసైన్డ్ భూముల విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu), మంత్రి నారాయణ (Narayana)కు హైకోర్టు (High Court)లో ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో ఇరువురిపై సీఐడీ నమోదు చేసిన కేసు హైకోర్టు కొట్టివేసింది. అసైన్డ్ భూముల్లో అవకతవకలు జరిగాయంటూ 2021 ఫిబ్రవరి 24న వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి (Alla Ramakrishna Reddy) సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా ఏపీ అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద చంద్రబాబు, నారాయణపై గతంలో సీఐడీ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన పిటిషన్‌కు ఎలాంటి ఆధారాలు లేవంటూ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు డిస్మిస్ చేసింది.








