2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేసి .. జాతికి అంకితం చేస్తాం : సీఎం చంద్రబాబు
రెండేళ్లలో ఇరిగేషన్ ప్రాజెక్టులపై రూ.24 వేల కోట్లు ఖర్చు చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) తెలిపారు. ఇబ్రహీంపట్నం సమీపంలోని కృష్ణా గోదావరి(Krishna-Godavari) పవిత్ర సంగమం వద్ద జలహారతి అనంతరం ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడారు. మార్చి 2027 నాటికి పోలవరం (Polavaram)పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. పెన్నా- వంశధార (Penna- Vamsadhara) నదుల అనుసంధానం చేయాలనేది లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం పూర్తి చేస్తే రాష్ట్రానికి కరవు ఉండదని స్పష్టం చేశారు. వచ్చే మÖడేళ్లలో రూ.35 వేల కోట్లు ఖర్చు చేసి, 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని తెలిపారు. గంగా కావేరి నదుల అనుసంధానం చేయగలిగితే దేశానికి తిరుగుండదన్నారు. గుంటూరు ఛానల్ ఆధునికీకరణకు ఈనెలలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఆగస్టు 14న అనకాపల్లిలో గోదావరి జలాలకు జలహారతి ఇస్తామని ప్రకటించారు. సెప్టెంబరు 1న వెలిగొండ ఫేజ్-1 ప్రాజెక్టు జాతికి అంకితం చేస్తామన్నారు.








