ఆగస్టు 9 న మిచిగాన్‌లో ఘనంగా ‘మాటా’ బోనాల జాతర
MATA: అమెరికాలోని తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా, ‘మాన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) మిచిగాన్ విభాగం ఆధ్వర్యంలో 2026 బోనాల జాతరను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
వేదిక , సమయం..
ఈ వేడుకలు ఆగస్టు 9, 2026, ఆదివారం ఉదయం 11:00 గంటల నుండి నొవి (Novi) లోని ‘శ్రీ వెంకటేశ్వర టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్’ వేదికగా జరగనున్నాయి. బోనాల ఊరేగింపుతో పాటు, మహాకాళి మాతకు బోనం సమర్పించడం, కుంకుమ పూజ వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అలాగే, ‘మహారాష్ట్ర మండల్ డెట్రాయిట్’ (MMD) వారి శీలేదార్ ధోల్ తాషా పథక్ ప్రత్యేక ప్రదర్శన ఈ కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
పాల్గొనే విధానం..
ఈ వేడుకలకు ప్రవేశం ఉచితం , భక్తులకు ప్రసాద వితరణ ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ‘పోతురాజు’గా లేదా ‘దేవి’ వేషధారణలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని నిర్వాహకులు తెలిపారు. సాంస్కృతిక సంప్రదాయాలను కాపాడే ఉద్దేశంతో నిర్వహిస్తున్న ఈ వేడుకల్లో భాగంగా, మరింత సమాచారం కోసం అమూల్య రమణగారి లేదా ప్రియ బాతినిని సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.








