టీటీఏ మెగా కన్వెన్షన్.. జులై 18, 19 తేదీల్లో వెండర్ ఎగ్జిబిట్ల సందర్శన
TTA: తెలంగాణ అమెరికన్ తెలుగు సంఘం (TTA) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘టీటీఏ మెగా కన్వెన్షన్ 2026′, నార్త్ కరోలినాలోని చార్లెట్ కన్వెన్షన్ సెంటర్లో జులై 17 నుండి 19 వరకు జరగనుంది. ఈ భారీ వేడుకలో భాగంగా 100కు పైగా ప్రముఖ వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తులను , సేవలను ప్రదర్శించనున్నాయి.
ప్రవేశం , సందర్శన..
ఈ మెగా ఈవెంట్లో ఏర్పాటు చేసిన వెండర్ ఎగ్జిబిట్స్ను సందర్శించేందుకు నిర్వాహకులు ప్రత్యేక అవకాశాన్ని కల్పిస్తున్నారు. ముఖ్యంగా జులై 18 , 19 తేదీల్లో వెండర్ ఎగ్జిబిట్లను సందర్శించడానికి సందర్శకులకు ఉచిత ప్రవేశం కల్పించడం విశేషం. తెలుగు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.
వివిధ రంగాల భాగస్వామ్యం..
ఈ ప్రదర్శనలో టెక్ సంస్థలు, రియల్ ఎస్టేట్, జ్యువెలరీ, దుస్తులు, ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఆర్థిక సేవలు, విద్యాసంస్థలు , ఆర్ట్ గ్యాలరీలతో సహా వైవిధ్యభరితమైన రంగాలకు చెందిన వ్యాపారులు పాల్గొంటున్నారు. వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు ఒకే చోట చేరడం ద్వారా, పరస్పరం మద్దతునిచ్చుకుంటూ ఎదగడానికి , వ్యాపార నెట్వర్కింగ్ను పెంచుకోవడానికి ఇది ఒక చక్కని వేదికగా నిలవనుంది.








