జై హనుమాన్ లో రానా నెగెటివ్ రోల్?
టాలీవుడ్ లో నటుడిగానే కాకుండా నిర్మాతగా, ప్రెజెంటర్‌గా, కంటెంట్ ఎంపికలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న రానా దగ్గుబాటి(rana daggubati) రీసెంట్ గా యాక్టర్ గా మాత్రం పెద్దగా స్క్రీన్ పై కనిపించడం లేదు. వరుస కథలు విన్నప్పటికీ ఆయన చాలా జాగ్రత్తగా ప్రాజెక్టులను ఎంపిక చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రశాంత్ వర్మ(Prasanth Varma) రూపొందిస్తున్న భారీ పౌరాణిక సినిమా జై హనుమాన్(jai hanuman) షూటింగ్లో రానా పాల్గొంటున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారం ప్రకారం ఈ సినిమాలో రానా(Rana) కీలక విలన్ పాత్రలో కనిపించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్మెంట్ రాకపోయినా, కథలో ఆయన పాత్రకు బలమైన ప్రాధాన్యం ఉంటుందనే డిస్కషన్ జరుగుతోంది. హనుమాన్(Hanuman) తో భారీ సక్సెస్‌ను అందుకున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. తేజ సజ్జా(Teja Sajja) తన పాత్రను కొనసాగిస్తుండగా, రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించనున్న విషయం సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది.
మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందుతోంది. విజువల్ ఎఫెక్ట్స్, మైథాలజికల్ ఎలిమెంట్స్, యాక్షన్ సీన్స్‌పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. హనుమాన్ సక్సెస్ తర్వాత దాదాపు రెండేళ్లపాటు స్క్రిప్ట్‌పై వర్క్ చేసిన ప్రశాంత్ వర్మ, ఈ సినిమాతో మరోసారి పెద్ద సక్సెస్ సాధించాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. అన్ని పనులు అనుకున్న ప్రకారం పూర్తైతే 2027 సెకండాఫ్ లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.








