‘RAW NTR’ సంస్థతో మాకు ఎలాంటి సంబంధం లేదు: జూనియర్ ఎన్టీఆర్ అధికారిక బృందం
‘RAW NTR’ పేరుతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థకు, నటుడు జూనియర్ ఎన్టీఆర్కి లేదా ఆయన కార్యాలయానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అధికారిక బృందం స్పష్టం చేసింది. ఎన్టీఆర్కి గానీ, ఆయన కార్యాలయానికి గానీ, ఆ సంస్థతో లేదా దాని కార్యకలాపాలతో ఎలాంటి అనుమతి, ప్రమేయం లేదా అనుబంధం లేదని వారు వెల్లడించారు. ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు లేదని, ఆయన పేరుతో ఎలాంటి ప్రకటనలు చేసే లేదా కార్యక్రమాలు నిర్వహించే అధికారం లేదని వారు స్పష్టం చేశారు.
ఎన్టీఆర్కి సంబంధించిన ఏదైనా సేవా కార్యక్రమం, ప్రజా సంక్షేమ కార్యక్రమం, అధికారిక ప్రకటన లేదా ఇతర కార్యకలాపాల గురించి సమాచారం కేవలం ఎన్టీఆర్ గారు లేదా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే వెల్లడిస్తుందని వారు పేర్కొన్నారు. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థల ద్వారా ప్రచారం చేసే సమాచారాన్ని, ప్రకటనలను అధికారికమైనవిగా లేదా విశ్వసనీయమైనవిగా పరిగణించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. క్లారిటీతో ఈ విషయానికి సంబంధించిన అన్ని అపోహలు, వదంతులు , ఊహాగానాలకు ముగింపు పలకాలని వారు కోరారు. సంప్రదాయ మీడియా, డిజిటల్ , సోషల్ మీడియా వేదికలు ధృవీకరించని సమాచారాన్ని ప్రచారం చేయకుండా, కేవలం అధికారిక వర్గాల ద్వారా విడుదలయ్యే సమాచారాన్నే విశ్వసించాలని వారు కోరారు. ఎన్టీఆర్పై అభిమానులు చూపుతున్న నిరంతర అభిమానానికి, మద్దతుకు వారు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.








