మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెర పడేదెప్పుడు?
మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi) నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ మూవీ విశ్వంభర(vishwambhara) రిలీజ్‌పై మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. చాలా కాలంగా వాయిదాలు ఎదుర్కొన్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దసరా సీజన్‌ను టార్గెట్ గా పెట్టుకుని అక్టోబర్ 16న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఆలోచన కొనసాగుతున్నప్పటికీ, అఫీషియల్ అనౌన్స్మెంట్ మాత్రం ఇంకా రాలేదు. గతంలోనూ పలు పండుగల సందర్భంగా రిలీజ్ వార్తలు వచ్చినా అవి కార్యరూపం దాల్చకపోవడంతో ఈసారి ఫ్యాన్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇక దసరా బరిలో ఇప్పటికే వెంకటేష్(venkatesh) నటిస్తున్న ఆదర్శ కుటుంబం(Adarsha kutumbam), రజనీకాంత్(rajinikanth) జైలర్2(jailer2) వంటి సినిమాలు తమ రిలీజ్ డేట్స్ ను అనౌన్స్ చేయడంతో పోటీ మరింత ఆసక్తికరంగా మారింది. ఇదే సమయంలో విశ్వంభర టీమ్ మాత్రం ఇంకా మౌనం పాటించడం వెనుక కారణాలపై సినీ వర్గాల్లో డిస్కషన్ సాగుతోంది. డిజిటల్ డీల్స్, విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ పూర్తి చేసే ప్రక్రియలో ఉండటంతో రిలీజ్ డేట్‌పై ఫైనల్ డెసిషన్ ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఈ వారంలో చిరంజీవి ఫైనల్ అవుట్‌పుట్‌ను పరిశీలించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
యూవీ క్రియేషన్స్(UV Creations) నిర్మిస్తున్న ఈ సినిమాకు వశిష్ఠ(Vassishta) దర్శకత్వం వహిస్తుండగా, త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తోంది. ఎం.ఎం. కీరవాణి(MM Keeravani) సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం చిరంజీవి, బాబీ(Bobby) దర్శకత్వంలో రూపొందుతున్న మరో సినిమా షూటింగ్లో బిజీగా ఉండగా, ఆ సినిమాను సంక్రాంతి 2027కి తీసుకురావాలనే ప్లాన్ ఉందని టాక్ వినిపిస్తోంది. అలాంటి పరిస్థితిలో విశ్వంభరను దసరాకే రిలీజ్ చేయడం మెగాస్టార్ రిలీజ్ ప్లానింగ్‌కు కూడా కీలకంగా మారింది.








