డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేష్
ఇటీవల ముంబయిలో కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకుని డిశ్చార్జి అయి వచ్చి హైదరాబాద్ నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను విద్య-ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. పవన్ కళ్యాణ్ నివాసానికి శనివారం వచ్చిన లోకేష్.. `పవనన్న మీరు త్వరగా కోలుకోవాలి` అని ఆకాంక్షించారు. వైద్యుల సూచనలు పాటించాలని, వీలైనంత మేరకు విశ్రాంతి తీసుకోవాలని లోకేష్ సూచించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భుజానికి అయిన గాయం, తలెత్తిన సమస్యలు, జరిగిన శస్త్ర చికిత్స గురించి లోకేష్ అడిగి తెలుసుకున్నారు.








