నాయకుల అంకితభావం…ప్లానింగ్ చూస్తుంటే… హ్యాటాఫ్ టు టిటిఎ
(ఛార్లెట్ నుంచి చెన్నూరి వెంకట సుబ్బారావు)
గతంలో ఎన్నడూ లేనంతగా ఇప్పుడు ఛార్లెట్ నగరం తెలుగువాళ్ళ సందడితో నిండిపోయి కనిపిస్తోంది. దానికి కారణం రేపటి నుంచి ఇక్కడ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (టిటిఎ) మహాసభలు జరగనుండటమే. ఈ వేడుకను పురస్కరించుకుని అమెరికాలోని నలుమూలలో ఉన్న టిటిఎ నాయకులు, తెలుగు వాళ్ళు తమ కుటుంబాలతో సహా ఇక్కడకు తరలి వచ్చారు. అలాగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకుకోసం ఎంతోమంది ప్రముఖులు ఇండియా నుంచి కూడా ఇక్కడకు తరలివచ్చారు. అందులో రాజకీయ నాయకులు, సినీరంగానికి చెందిన కళాకారులు, సాహితీవేత్తలు ఇలా వివిధ రంగాల ప్రముఖులు ఉన్నారు. ముందురోజున ఛార్లెట్ లోని హోటల్ సెనెస్టాలో సమావేశమైన టిటిఎ నాయకులు హడావుడిగా కనిపించారు. ఎందుకంటే జరిగే వేడుక సామాన్యమైన వేడుక కాదు….దాదాపు 10వేల మంది పైగా వచ్చే వేడుక. ఇలాంటి వేడుకల్లో వచ్చినవారికి ఆతిధ్య పరంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడటం మాములు విషయం కాదుకదా!. అలాగే ఏర్పాటు చేసిన సాంస్కృతిక వేడుకలకు సంబంధించి చివరి నిముషంలో గందరగోళం లేకుండా చూడాలన్న ముందుజాగ్రత్తతో అన్నీ విషయాలను కాన్ఫరెన్స్ కోసం ఏర్పాటు చేసిన కమిటీల నాయకులు, తమ పెద్దలతో కూర్చుని తమ ప్రణాళికలను తెలియజేస్తున్నారు. టిటిఎ వ్యవస్థాపకులు డా. పైళ్ళ మల్లారెడ్డిగారు, అడ్వయిజరీ కమిటీ చైర్ విజయ్ పాల్ రెడ్డిగారు, మరో అడ్వయిజరీకమిటీ సభ్యులు మోహన్ పాటలోళ్ళగారు, కన్వీనర్ ప్రవీణ్ చింతా, ఇలా పెద్ద నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొని రేపటి మహాసభల విషయంపై చర్చించుకుని అవసరమైన సూచనలను, సలహాలను ఇస్తూ ఉండటం కనిపించింది.
ఛార్లెట్ నగరం గురించి…
ఒకప్పుడు చిన్న పట్టణంగా ఉన్న ఛార్లెట్, ఇప్పుడు అమెరికాలోనే ఒక ప్రధాన ఆర్థిక, ఐటీ కేంద్రంగా ఎదుగుతోంది. మన తెలుగు వారు కూడా ఇక్కడి ఐటీ, బ్యాంకింగ్ మరియు వ్యాపార రంగాలలో స్థిరపడుతూ బలమైన కమ్యూనిటీగా ఏర్పడుతున్నారు. గత 30 ఏళ్లలో ఇంత పెద్ద స్థాయిలో కాన్ఫరెన్స్‌లు ఇక్కడ జరగలేదు. అందుకు ముఖ్య కారణం ఇక్కడ తెలుగువారి సంఖ్య చాలా తక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. ప్రస్తుతం షార్లెట్ నగరం ఇలాంటి భారీ కార్యక్రమాలను, ప్రతిష్టాత్మకమైన బిజినెస్ కాన్ఫరెన్స్‌లను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని విధాలా సిద్ధంగా ఉంది.
ఇవి కూడా చదవండి
ఈ ప్రాంతంలో కొత్తగా ఎదుగుతున్న తెలుగు వ్యాపారవేత్తలకు, కమ్యూనిటీకి ఈమహాసభలు గొప్ప మైలురాయి కానుంది. ఈ ప్రాంతానికి చెందిన నవీన్ మలిపెద్ది టిటిఎ అధ్యక్షులుగా ఎన్నికైన తరువాత ఛార్లెట్ లో ఈ మహాసభలను నిర్వహించాలని నిర్ణయం తీసుకుని అందుకు పెద్దలను ఒప్పించడంలో కృతకృత్యులయ్యారు. నవీన్ మెలిపెద్ది కి బాసటగా వ్యవస్థాపకులు డా. మల్లా రెడ్డి కూడా షార్లెట్ లో కాన్ఫరెన్స్ చెయ్యోచ్చ్చు అని అనుకొన్నారు. నవీన్ మలిపెద్ది ఈ మహాసభల నిర్వహణను ఛాలెంజింగ్ గా తీసుకుని మొదటి నుంచి మహాసభల విషయాలపై తీవ్రంగానే దృష్టి పెట్టి అందరినీ కూడా ఈ మహాసభలను విజయవంతానికి కృషి చేసేటట్లుగా వారితో కలిసి కూర్చుని చర్చించడం లాంటివి చేస్తూ వచ్చారు. అంతే కాకుండా కాన్ఫరెన్స్ నిర్వాహణ కోసం దాదాపు 100 మంది పైగా యువ కార్య కర్తలను టీ టీ ఏ లోకి తీసుకు వచ్చారు. ఈ మహాసభల కారణంగా ఈ ప్రాంతం ఇప్పుడు తెలుగువారికి మరో పెద్ద గమ్యస్థానంగా మారనున్నది.
సెనెస్టా హోటల్ లో సమావేశం….
గత వారం రోజులుగా టిటిఎ నాయకులంతా సెనెస్టా హోటల్ లో సమావేశమవుతూ వస్తున్నారు. ప్రముఖ నాయకులు డాక్టర్ పైళ్ళ మల్లారెడ్డి గారు, విజయ్ పాల్ రెడ్డి గారు, మోహన్ రెడ్డి పాటలోళ్ళ గారు… ఇలా టీటీఏ నాయకత్వ బృందం మొత్తం హోటల్ సెనెస్టాలో సమావేశం కావడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక మెగా కాన్ఫరెన్స్ జరిగే ముందర ఒక రోజు ముందర ఏం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు ఎన్నో విషయాలు ఈరోజు హోటల్ సెనస్టాలో టిటిఏ నిర్వాహక వర్గం ఒక వార్ రూమ్ లో కూర్చుని చేయాల్సిన పనులు, స్పాన్సర్ల నుంచి, డోనార్స్ నుంచి రావాల్సిన డబ్బులు, చేయాల్సిన పేమెంట్స్, చేయాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని లెక్క చూసుకుంటూనే మరోవైపు వచ్చే అతిథులను రిసీవ్ చేసుకోవటం వారి కోసం ఎయిర్ పోర్టుకి మనుషులను పంపటం చేస్తూ కనిపించింది. ఇంకో పక్క హాస్పిటాలిటీ కమిటీ వారితో ఎవరెవరికి హోటల్ ఎకామడేషన్ వగైరా ఏర్పాట్లు చేయాలో సూచనలు ఇస్తూ కనిపించింది. ఇప్పుడు రాత్రి దాదాపు 12 గంటల మిడ్నైట్ సమయం (16.7.2026) అయినా సరే హోటల్ సెనస్టా గ్రౌండ్ ఫ్లోర్ లాంజ్ లో దాదాపు 200 మంది టిటిఏ కార్యనిర్వాహక వర్గం రకరకాల పనులు చేస్తూ కనిపించారు.
రెండు రోజుల కాన్ఫరెన్స్ జనరంజకంగా తీర్చిదిద్దటానికి అనేక మంది అనేక రకాలుగా వారి విధులు నిర్వర్తిస్తున్నారు. పొద్దునే టీవీ హోస్ట్ సుమ వచ్చారు. ఇండియా నుంచి రావటం వారిని రిసీవ్ చేసుకోవటం వారు హోటల్లో బస చేయటం తర్వాత వెంటనే సెనస్టాలో వారి రూమ్ కి వస్తే వారికి ఒక వేరే సపరేట్ రూమ్ లో రేపు ఎల్లుండి నిర్వహించవలసిన కార్యక్రమం దాని వివరాలు మినిట్ టు మినిట్ ప్రోగ్రామును అడ్వైజరీ కౌన్సిల్, ప్రెసిడెంట్ కూర్చుని డిస్కస్ చేశారు. ఇంకొక రూమ్ లో గాయకుడు మ్యూజిక్ డైరెక్టర్ వందేమాతరం శ్రీనివాస్ గారు తన గాయని గాయకులతో తన బృందంతో రాత్రి 11 గంటలకు కూడా ప్రాక్టీస్ చేస్తూనే కనిపించారు. ఒక పక్క కీరవాణి గారు లాంటి మోస్ట్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ కన్సర్ట్ చేస్తూ ఉండటం వల్ల, మరోవైపు వందేమాతరం శ్రీనివాస్ గారు కూడా తన బృందం పాడే పాటలు కూడా అందరికీ నచ్చేలా ఉండాలన్న పట్టుదలతో అకుంఠిత దీక్షతో ప్రాక్టీస్ చేస్తున్నారు.
ఇంకో పక్క ఈ హోటల్లో బస చేసిన ఇండియా నుంచి వచ్చిన స్పాన్సర్లు రాజ్ పుష్ప నుంచి, జిహెచఆర్ నుంచి, ఎంఎసఎన్ నుంచి యాజమాన్య ప్రతినిధులు వచ్చారు. వారికి కావలసిన భోజన సదుపాయాలు వంటి అరేంజ్మెంట్స్ తర్వాత రేపు నుంచి రేపు పొద్దున్న నుంచి సాయంత్రం లోపల వచ్చే అతిథులు వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళ ఎకామడేషన్ అరేంజ్ చేయటం దానికి సంబంధించిన ఏర్పాట్లు చూసే ట్రాన్స్పోర్ట్ బృందం, ఆతిధ్య బృందం తీవ్రంగా కృషి చేస్తూ కనిపించింది. ఇంకో పక్క కాన్ఫరెన్స కోసం ఏర్పాటు చేసిన 35 కమిటీలు ఏ విధంగా పనిచేస్తున్నాయో ప్రెసిడెంట్ నవీన్ రెడ్డి గారు చెబుతూ, 35 కమిటీల్లో దాదాపు 10 కమిటీలు ఇక్కడే పనిచేస్తున్నాయని తెలిపారు. అలుపెరగకుండా సాగుతున్న ఈ సన్నాహాలు చూస్తుంటే, రేపటి నుంచి జరగబోయే ఈ మెగా కాన్ఫరెన్స్ ఎంత అద్భుతంగా ఉండబోతోందో అర్థమవుతోంది. ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌ను విజయవంతం చేయడానికి 35 కమిటీలు అహర్నిశలు శ్రమిస్తున్న తీరు నిజంగా ప్రశంసనీయం. ఒక రోజు ముందు అర్ధరాత్రి వేళ కూడా అక్కడ జరుగుతున్న విషయాలు గమనిస్తే అర్ధం అయ్యే విషయం – 35 కమిటీలు వేర్వేరుగా పనిచేస్తున్నా, అందరి లక్ష్యం ఒక్కటే—విచ్చేసే ప్రతి అతిథికి ఒక మధురమైన అనుభూతిని అందించడం. ఈ స్థాయి అంకితభావం చూస్తుంటే, ఈ మెగా కాన్ఫరెన్స్ అత్యంత వైభవంగా, జనరంజకంగా జరిగి సరికొత్త చరిత్ర సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి








