క్రిస్మస్ బరిలో బాలయ్య?
నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా గోపీచంద్ మలినేని(Gopichand Malineni) దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ NBK111 షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో వేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే కీలక షెడ్యూల్స్ పూర్తిచేసిన చిత్రబృందం మిగిలిన షూటింగ్ ను దసరా నాటికి ముగించేలా ప్లాన్ చేస్తోంది. మొదట రిలీజ్ డేట్‌పై పలు ఆప్షన్లు పరిశీలించినప్పటికీ, ఇప్పుడు డిసెంబర్ లాస్ట్ వీక్‌ను టార్గెట్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో డిస్కషన్ జరుగుతోంది. క్రిస్మస్ హాలీడేస్ సీజన్లో ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభిస్తుందనే అంచనాతో మేకర్స్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం.
డిసెంబర్ 3న ప్రభాస్(Prabhas) నటిస్తున్న ఫౌజీ(Fauzi) ఇప్పటికే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడంతో అదే నెలలో మరో భారీ సినిమా రావడం బాక్సాఫీస్ పరంగా ఆసక్తిని పెంచుతోంది. ఏడాది చివరి హాలీడే సీజన్‌ను క్యాష్ చేసుకునేందుకు పలువురు నిర్మాతలు సిద్ధమవుతుండగా, బాలకృష్ణ సినిమా కూడా అదే విండోను టార్గెట్‌గా పెట్టుకోవడం ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే అఫీషియల్ రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి ఇంకా స్పష్టమైన ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే, ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ గ్లింప్స్‌ను త్వరలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. కాజల్ అగర్వాల్(Kajal Aggarwal) హీరోయిన్ గా నటిస్తుండగా, సంజయ్ దత్(Sanjay Dutt) కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు(Venkata Satish Kilaru) నిర్మిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తైన వెంటనే బాలకృష్ణ, కొరటాల శివ(Koratala Siva) దర్శకత్వంలో రూపొందనున్న సినిమాను మొదలుపెట్టనున్నారు.








