మంత్రి లోకేశ్ కు ధన్యవాదాలు : గల్లా జయదేశ్
అమరరాజ (Amara Raja) ప్రస్థానం ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభమైనందున ఈ ప్రాంతం ఎప్పటికీ తమకు ఎంతో ప్రత్యేకమైనదని అమరరాజా గ్రూప్ సీఎండీ, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ( Galla Jayadev) అన్నారు. ఇక్కడ తమ మూలాలు చాలా బలమైనవన్నారు. అమరరాజ తెలంగాణ (Telangana)లో విస్తరణపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) పోస్ట్‌పై గల్లా జయదేవ్ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌పై తమకున్న నిబద్ధత ఎన్నటికీ సడలదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఈ బంధం మరింత బలపడుతుందని గట్టిగా నమ్ముతున్నానన్నారు. లోకేశ్ ఆత్మీయతకు ధన్యవాదాలు తెలిపారు. కలిసికట్టుగా మరిన్ని నూతన అవకాశాలను సృష్టిస్తూ, మరింత ఉజ్వల భవిష్యత్తును నిర్మించడానికి ముందుకు సాగుదామని జయదేవ్ ఆకాంక్షించారు.
ఇవి కూడా చదవండి








