‘జాను జిగర్స్ గెట్ రెడీ’… టీటీఏ మెగా కన్వెన్షన్లో సందడి చేయనున్న నవీన్ పోలిశెట్టి
అమెరికాలో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్ 2026లో ప్రముఖ టాలీవుడ్ నటుడు నవీన్ పోలిశెట్టి సందడి చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక వీడియో ద్వారా వెల్లడించారు. అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన తర్వాత, ఇప్పుడు మొదటిసారిగా షార్లెట్, నార్త్ కరోలినాలో జరగనున్న టీటీఏ మెగా కన్వెన్షన్లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
జులై 19న జరగనున్న ఈ కార్యక్రమంలో తాను స్టేజ్ ఎక్కినప్పుడు, అక్కడ ఉన్న ప్రేక్షకుల ఎనర్జీతో వేదిక దద్దరిల్లిపోవాలని నవీన్ పోలిశెట్టి కోరారు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా ఈ కార్యక్రమానికి హాజరుకావాలని, ఇది హాస్యంతో, నృత్యంతో, పాటలతో కూడిన నాన్-స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈవెనింగ్గా ఉండబోతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ మెగా ఈవెంట్ ద్వారా తెలుగు వారందరినీ కలుసుకోవడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని నవీన్ పోలిశెట్టి తన అభిమానులకు తెలియజేశారు.








