2028 నాటికి వరంగల్ ఎయిర్పోర్టు పూర్తి : రామచందర్ రావు
వరంగల్ ఎయిర్పోర్టు (Warangal Airport)ను 2028 నాటికి పూర్తిచేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు (Ramchander Rao) తెలిపారు. ఆ క్రెడిట్ తీసుకునేందుకు సీఎం రేవంత్(Warangal Airport) ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.ఈ సందర్భంగా రామచందర్రావు మీడియాతో మాట్లాడుతూ 2011లో రైట్స్ కంపెనీ దేశంలో ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు సాధ్యాసాధ్యాలపై చేసిన అధ్యయనంలో వరంగల్ (Warangal), కడప (Kadapa) పేర్లు ఉన్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చాక ఉడాన్ స్కీం (UDAN scheme)తో ఎయిర్ పోర్టుల పెంపునకు శ్రీకారం చుట్టింది. కొత్తగా 88 ఎయిర్పోర్టులకు ఆమోదం తెలిపింది. అందులో వరంగల్ కూడా ఉంది. భూసేకరణ పూర్తికాకపోవడం వల్లే ఎయిర్ పోర్టు నిర్మాణం ఇంత ఆలస్యమైంది. వరంగల్ ఎయిర్పోర్టు వస్తోందంటే దానికి కారణం మోదీ. ఆదిలాబాద్ డిఫెన్స్ ఎయిర్పోర్టు రాబోతోంది అని తెలిపారు.








