ఈ విషయంలో జోక్యం చేసుకోను : మంత్రి కోమటిరెడ్డి
తుంగతుర్తి (Thungathurthi)లో నెలకొన్న వివాదాన్ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) చూసుకుంటారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. ఈ విషయంలో తాను జోక్యం చేసుకోబోనని స్పష్టం చేశారు. బంజారాహిల్స్‌లోని కోమటిరెడ్డి నివాసంలో ఆయనతో జగ్గారెడ్డి భేటీ అయ్యారు. తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవుల విషయంలో నెలకొన్న వివాదంపై చర్చించారు. కోమటిరెడ్డితో భేటీ అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. తుంగతుర్తి అంశంలో కలగజేసుకునేందుకు కోమటిరెడ్డి ఆసక్తి చూపించడం లేదున్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కావాలంటే వరుసగా ముడేళ్లు పార్టీ కార్యకర్తగా కొనసాగాలనే ఏఐసీసీ నిబంధన (AICC rule) ఉందన్నారు. తుంగతుర్తిలో ముడు, నాలుగు మండలాల్లో ఆ నిబంధనల ప్రకారం నియామకాలు జరగలేదన్నారు. ఈ వ్యవహారంపై ఈనెల 20లోపు నివేదిక ఇస్తానని తెలిపారు.








