భవిష్యత్తులో పర్యాటక ప్రాంతంగా పోలవరం : మాధవ్
గత వైసీపీ సర్కారు పోలవరం ప్రాజెక్టు (Polavaram Project)ను తీవ్ర నిర్లక్ష్యం చేస్తే, ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) పరుగులు పెట్టిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ (Madhav) అన్నారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ప్రధాని మోదీ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సహకారం అందిస్తున్నారని తెలిపారు. త్వరలో పోలవరం కుడికాలువకు నీరు విడుదల చేసేందుకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. భవిష్యత్తులో పోలవరం ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ స్థితిగతులు, పర్యాటక విభాగం, అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు తీసుకురావడమే లక్ష్యంగా రాష్ట్ర బీజేపీ నేతలు రాజహేంద్రవరం నుంచి పోలవరం సందర్శనయాత్ర చేపట్టారు. వెయ్యి మందితో కూడిన కమలదళం కార్లతో ర్యాలీగా పోలవరం వద్దకు వెళ్లారు. ఈ ర్యాలీని ఎంపీ పురంధేశ్వరి (Purandheswari) జెండా ఊపి ప్రారంభించారు. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ (Bhupathiraju Srinivasa Varma), రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పాల్గొన్నారు.








