తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా భువనేశ్వరి
తిరుమల శ్రీవారిని ముఖ్యమంత్రి చంద్రబబు సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) దర్శించుకున్నారు. ఉదయం వైకుంఠం క్యూకాంప్లెక్సు ద్వారా ఆలయంలోకి వెళ్లిన భువనేశ్వరి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu), ఈవో రవిచంద్ర (EO Ravichandra), అదనపు ఈవో వెంకయ్య చౌదరి (Venkayya Chowdary) స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మూలవిరాట్టును దర్శించుకొని మొక్కలు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్, ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.








