ఈ ఘటనను హిందూ సమాజమంతా ఖండించాలి : బండి సంజయ్
బలవంతంగా హిందూ సంస్కృతిపై దాడి చేస్తున్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) ఆగ్రహం వ్యక్తం చేశారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ (Success School) యాజమాన్యం కల్మా (Kalma) చదవాలని విద్యార్థి (student)కి హుకుం జారీ చేయడం దుర్మార్గం అన్నారు. స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోకాల్డ్ సెక్యూలర్ సంఘాలు దీనిపై ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ ఘటనను హిందూ సమాజమంతా ముక్తకంఠంతో ఖండించాలని పిలుపునిచ్చారు. సైదాబాద్ సక్సెస్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు (Actions) తీసుకోవాలని డిమాండ్ చేశారు.








