కాలిఫోర్నియాలో అంగరంగ వైభవంగా జరగనున్న ‘సిలికాన్ ఆంధ్ర’ రజతోత్సవ వేడుకలు!
సిలికాన్ ఆంధ్ర సంస్థ తన 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఆగస్టు 1, 2026న కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరేనాలో ‘సిలికాన్ ఆంధ్ర రజతోత్సవ వేడుకలను’ ఘనంగా నిర్వహించనుంది. ఈ కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నానికి కూడా వేదిక కానుంది.
కార్యక్రమ వివరాలు:
ఉదయం 8:30 గంటలకు: శోభా యాత్రతో కార్యక్రమం ప్రారంభమవుతుంది.
ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12:00 గంటల వరకు: రంగ పూజ, కుంభ హారతి, ప్రారంభోత్సవం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగంగా ‘సంగీతామృతవర్షిణి’, ‘లయామృతవర్షిణి’ కార్యక్రమాలు జరుగుతాయి.
మధ్యాహ్నం 1:00 నుండి 5:00 గంటల వరకు: ప్రొక్లమేషన్స్, కూచిపూడి నాట్యామృతవర్షిణి, లలితామృతవర్షిణి , గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రయత్నంలో భాగంగా ‘శతక శంఖారావం’ నిర్వహిస్తారు.
సాయంత్రం 6:00 నుండి 10:00 గంటల వరకు: అతిథుల సత్కారం, వందే భారతం, దక్ష యజ్ఞం, జానపద జాతర వంటి కార్యక్రమాలు ఉంటాయి.
ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాలు , రిజిస్ట్రేషన్ కోసం silverjubilee.siliconandhra.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.








