ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను పరామర్శించిన మంత్రి లోకేష్
ప్రొద్దుటూరు: కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ (Putta Sudhakar Yadav), వారి కుటుంబ సభ్యులను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) పరామర్శించారు. పుట్టా సుధాకర్ యాదవ్ మాతృమూర్తి పుట్టా పోలమ్మ (Putta Polamma) ఇటీవల మరణించడంతో.. మంత్రి లోకేష్ ప్రొద్దుటూరు (Proddatur)లోని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పుట్టా పోలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.








