సింగపూర్ ప్రతినిధులతో సీఎం చంద్రబాబు భేటీ
రాజధాని అమరావతి (Amaravati) రెండో దశ మాస్టర్ ప్లాన్ (Master Plan)ను 22 వారాల్లో ఇస్తామని సుర్బానా జురాంగ్ సంస్థ ( సింగపూర్) ప్రతినిధులు తెలిపారు. రాజధాని విస్తరణ ప్రణాళికలో భాగంగా రెండో దశలో మొత్తం 709.6 చదరపు కిలోమీటర్ల ప్రాంతానికి ఈ సంస్థ సమీకృత మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తోంది. రాజధాని ప్రాంతంలో పర్యటించిన సింగపూర్ ప్రతినిధుల బృందం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)తో భేటీ అయింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి నివసించేలా, అత్యంత నివాసయోగ్యంగా అమరావతి ఉండాలని, రాష్ట్ర భవిష్యత్ ఆర్థికాభివృద్ధికి కేంద్ర బిందువుగా, ప్రపంచస్థాయి నగరంగా రాజధానిని తీర్చిదిద్దేలా అమరావతి -2.0 మాస్టర్ ప్లాన్ రూపొందించాలని చంద్రబాబు సూచించారు.
సింగపూర్ (Singapore) ప్రతినిధులు ప్రాజెక్టు పరిధి, అమలు ప్రణాళిక, దశలవారీ కార్యాచరణను ముఖ్యమంత్రికి వివరించారు. ఏరియా ప్లాన్ మౌలిక వసతుల ప్రణాళిక, పెట్టుబడి నమÖనా వంటి అంశాలను ప్రాజెక్టులో భాగంగా చేస్తున్నట్లు తెలిపారు. ఇన్నర్, అవుటర్ రింగ్‌రోడ్లతో అంతర్జాతీయ స్థాయి నగరంగా రాజధానిని నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు.








