శ్రీవారి ఆశీస్సులతో ఏపీ మరింత అభివృద్ధి చెందాలి : మన్నవ మోహనకృష్ణ
తిరుమల శ్రీవారిని ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ (Mannava Mohana Krishna) దర్శించుకున్నారు. దర్శనం తర్వాత ఆలయ అధికారులు వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా మన్నవ మోహనకృష్ణ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ఎదగాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు. తిరుమల (Tirumala) కు వచ్చే కోట్లాది మంది భక్తులకు టీటీడీ కల్పిస్తున్న వసతులు అద్భుతంగా ఉన్నాయన్నారు.
సీఎం చంద్రబాబు (CM Chandrababu) విజన్, మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సాంకేతిక దృక్పథంతో ఏపీ మరోసారి దేశంలో పెట్టుబడులు, సాంకేతిక అభివృద్ధికి చిరునామాగా మారుతోందన్నారు. రాష్ట్ర యువత భవిష్యత్తుకు పెట్టుబడులు, ఉద్యోగాలు, ఆర్థికాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. శ్రీవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేశంలోనే నంబర్1 టెక్నాలజీ, ఇన్నోవేషన్, పెట్టుబడులు, ఉద్యోగాల కేంద్రంగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.








