ఆగస్టు 1 న సిలికాన్ఆంధ్ర రజతోత్సవ సంబరాలు
SiliconAndhra: అమెరికాలో తెలుగు సంస్కృతీ సంప్రదాయాలను దశదిశలా చాటుతూ, గత 25 ఏళ్లుగా ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న ప్రముఖ సంస్థ ‘సిలికాన్ఆంధ్ర‘ తన రజతోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆగస్టు 1, 2026 శనివారం రోజు కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ అరీనా (Oakland Arena) వేదికగా ఈ మెగా ఈవెంట్ జరగనుంది.
ప్రధాన ఆకర్షణ..
ఉదయం 9:00 గంటల నుండి రాత్రి 10:00 గంటల వరకు అంటే దాదాపు 10 గంటల పాటు అవిరామంగా సాగే ఈ సాంస్కృతిక జాతరలో, తెలుగువారి కళా వైభవాన్ని చాటిచెప్పేలా పలు ఆసక్తికరమైన కార్యక్రమాలను రూపొందించారు. 1,000 మందితో కూడిన భారీ కర్ణాటక సంగీత కచేరీ, 400 మంది కళాకారుల కూచిపూడి నృత్య ప్రదర్శన, , 300 మంది సాంప్రదాయ వాయిద్యకారుల ప్రదర్శనలు ఈ వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అంతేకాకుండా, గిన్నిస్ వరల్డ్ రికార్డును లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక ప్రదర్శనలు ప్లాన్ చేయడం విశేషం.
వివరాలు..
ఈ వేడుకల్లో పాల్గొనాలనుకునే వారు $25 ప్రవేశ రుసుముతో టిక్కెట్లను పొందవచ్చు. రిజిస్ట్రేషన్, హోటల్ వసతి , విరాళాలకు సంబంధించిన పూర్తి వివరాల కోసం https://silverjubilee.siliconandhra.org/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 1 877 588 7275 నంబర్‌ను సంప్రదించవచ్చు. తెలుగువారందరూ ఈ చారిత్రక వేడుకల్లో భాగస్వాములై, మన సంస్కృతిని ప్రపంచానికి చాటాలని నిర్వాహకులు కోరుతున్నారు.








