పీపీపీ ప్రాజెక్టుల పురోగతిపై సీఎం చంబ్రాబు సమీక్ష
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్) కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు (Shipyards), విమానాశ్రయాలు (Airports), పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ కింద చేపట్టింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో పురోగతిలో రూ.1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్ లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఈ సమావేశానికి ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.








