పూల అందంతో వెకేషనల్ వైబ్ లో యుక్తి
మోడల్ గా కెరీర్ ను ప్రారంభించి, తర్వాత మ్యూజిక్ వీడియోల ద్వారా పాపులరైన యుక్తి తరేజా, టాలీవుడ్లో రంగబలి(rangabali), కె ర్యాంప్(K Ramp) సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంటూ వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే యుక్తి మరోసారి తన స్టైలిష్ లుక్‌తో అభిమానులను ఆకట్టుకుంది. తాజాగా సోషల్ మీడియాలో ఆమె పంచుకున్న ఈ వెకేషన్ ఫోటో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. పచ్చని కొబ్బరి చెట్లు, సముద్ర తీరాన్ని తలపించే అందమైన నేపథ్యం మధ్య యుక్తి ఎంతో సహజంగా కెమెరాకు పోజిచ్చింది. బ్లాక్ కలర్ టైడ్ క్రాప్ టాప్కు ఎల్లో-బ్లాక్ కాంబినేషన్లో ఎలిఫెంట్ ప్రింట్ స్కర్ట్‌ను జతచేసి ట్రెండీ లుక్‌లో కనిపించింది. చెవి వెనుక పెట్టుకున్న ఆరెంజ్ రంగు పువ్వు ఆమె లుక్కు మరింత ఫ్రెష్‌నెస్‌ను జోడించింది. ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్ మేకప్, అందమైన చిరునవ్వుతో యుక్తి ఈ ఫోటోలో స్పెషల్ గా మెరవగా, నెటిజన్లు ఆమె ఫోటోకు లైకులు కొడుతున్నారు.








