సోనమ్ వాంగ్ చుక్ కి వెంటనే వైద్యం అందించాలి : కోర్టు ఆదేశాలు
సామాజిక ఉద్యమకారుడు సోనమ్ వాంగ్ చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు జోక్యం చేసుకుంది. ఆయన ప్రాణాలు కాపాడేందుకు ప్రభుత్వ వైద్యుడి పర్యవేక్షణలో ఎలాంటి వైద్య చికిత్సలైనా అందించాలని ఆదేశించింది. ‘‘ప్రతి పౌరుడి ప్రాణం అమూల్యమైంది. అలాంటి ప్రాణాలు కాపాడటానికి ప్రభుత్వాలు అన్ని ప్రయత్నాలు చేయాలి’’ అని న్యాయస్థానం పేర్కొంది.
మరో 48 గంటలు వాంగ్ చుక్ ఇలాగే దీక్షలో వుంటే ఆయన ప్రాణాలకు ప్రమాదం వుందని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆయన ఆరోగ్యం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు పిటిషన్ లో. ఈ పిటిషన్ పై కోర్టు విచారణ జరిపింది. వైద్యులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయనకు తగిన చికిత్స అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
గత 19 రోజులుగా వాంగ్ చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షకు కూర్చొన్నారు. నీట్ పరీక్ష నిర్వహణ లోపాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష ప్రారంభించారు.








