‘అయ్యగారే నెం.1’.. అఖిల్‌పై భార్య కామెంట్ వైరల్
అక్కినేని అఖిల్(Akkineni Akhil) నటించిన లెనిన్(Lenin) బాక్సాఫీస్ వద్ద సక్సెస్ఫుల్ గా ప్రదర్శితమవుతుండటంతో మేకర్స్ అభిమానుల సమక్షంలో సక్సెస్ మీట్ ను ఘనంగా నిర్వహించింది. పెళ్లి తర్వాత అఖిల్‌తో కలిసి జైనబ్ రవ్జీ(Zainab Ravjee) తొలిసారిగా సినిమా కార్యక్రమంలో పాల్గొనడం ఈ వేడుకకు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇప్పటికే సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణతో అఖిల్ కెరీర్లో ఈ సినిమా కీలక మైలురాయిగా నిలుస్తోందనే డిస్కషన్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
ఈ సందర్భంగా అఖిల్ యాక్టింగ్ గురించి జైనబ్‌ను ప్రశ్నించగా, ఆమె చిరునవ్వుతో చెప్పిన అయ్యగారే నెం.1 అనే ఒక్క మాట అక్కడున్న అభిమానులను ఉత్సాహపరిచింది. సోషల్ మీడియాలో చాలా కాలంగా వైరల్‌గా మారిన ఈ పదాన్ని ఆమె సరదాగా ఉపయోగించడంతో ఆడియన్స్ భారీగా స్పందించారు. ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలు, ముఖ్యంగా జైనబ్ కామెంట్స్, సోషల్ మీడియాలో వేగంగా వైరలవుతూ అభిమానుల నుంచి విశేష ఆదరణ పొందుతున్నాయి. పలువురు నెటిజన్లు ఈ క్యూట్ రియాక్షన్‌ను షేర్ చేస్తూ అఖిల్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వంలో రూపొందిన లెనిన్ రాయలసీమ నేపథ్యంలోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అంశాలతో తెరకెక్కింది. అఖిల్ యాక్టింగ్‌తో పాటూ ఎమోషనల్ స్క్రీన్ ప్లే, మ్యూజిక్, యాక్షన్ ఎపిసోడ్లు ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna Studios), సితార ఎంటర్టైన్మెంట్స్(Sithara Entertainments) సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా సక్సెస్‌తో అఖిల్ కెరీర్‌కు కొత్త ఊపు వచ్చినట్టేనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.








