మాజీ మంత్రి అంబటి రాంబాబు కు షాక్
కిర్లంపూడి పోలీస్ స్టేషన్ (Kirlampudi Police Station)లో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు (Ambati Rambabu)పై కేసు నమోదైంది. ముద్రగడ పద్మనాభం (Mudragada Padmanabham) అంత్యక్రియల సమయంలో పోలీసుల విధులకు ఆయన ఆటంకం కలిగించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ ఇస్తుండగా అంబటి, అతని అనుచరులు పోలీసులను తోసేశారు. ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు (Veluduti Appalaraju), పలువురు కానిస్టేబుళ్లు కిర్లంపూడి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల ముందే ఉద్దేశపూర్వకంగా తోసేశారని, తమ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంబటి రాంబాబు సహా మరికొందరిపై పలు సెక్షన్ల కింద కిర్లంపూడి పోలీసులు కేసు నమోదు చేశారు.








