మహేశ్ గౌడ్ కీలక ప్రకటన .. ఈనెలలోనే
నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) కీలక ప్రకటన చేశారు. ఈ నెలలో 50 నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. మీడియాతో మహేశ్ కుమార్ మాట్లాడుతూ గతంలో పనితీరు కనబరిచిన వారిని రెన్యూవల్ చేసే అవకాశం ఉందన్నారు. డీసీసీల పనితీరు బాగోలేకపోతే మార్చే అవకాశం ఉందని వెల్లడించారు. పార్టీ పదవులపై మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan)తో చర్చించామని తెలిపారు. రెండు రోజుల్లో సీఎం రేవంత్‌రెడ్డి ( CM Revanth Reddy)తో భేటీ అవుతామన్నారు. రెన్యువల్ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. మండల కమిటీలో డీసీసీల రిపోర్ట్ ఫైనల్ అని స్పష్టం చేశారు. కూనంనేనితో తమకెలాంటి విభేదాలూ లేవన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవాలని చెప్పారు. ప్రతి చిన్న విషయానికీ గాంధీభవన్ (Gandhi Bhavan) రావటం మానుకోవాలని క్యాడర్‌కు సూచించారు. నలుగురు ఐదుగురు మినహా అందరు డీసీసీ అధ్యక్షుల పనితీరు బాగుందని మహేశ్ గౌడ్ కితాబిచ్చారు.








