తెలంగాణలో సర్ గడువు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పొడిగించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం సవరించింది. దీంతో బిఎల్ఓ (BLO)లు ఇంటింటి సర్వేకు ఆగస్టు 3 వరకు గడువు పొడిగించినట్లు అయింది. ఆగస్టు 10న డ్రాఫ్ట్ ఓటరు జాబితా (Voter List) విడుదల చేయనుంది. సెప్టెంబర్ 9 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలను స్వీకరించనుంది. అక్టోబర్ 8వ తేదీ వరకు అభ్యంతరాలను పరిష్కారించనుంది. అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను ప్రచురించనుంది. సర్ గడువును పొడిగించాలంటూ కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ప్రభుత్వం (Government of Telangana) విజ్ఞప్తి చేసింది. దీంతో సర్ షెడ్యూల్ను సీఈసీ (CEC) సవరించింది. దీనిని అధికారులతోపాటు రాజకీయ పార్టీలకు తెలియజేయాలని జారీ చేసిన ఆదేశాల్లో సీఈసీ స్పష్టం చేసింది.








