మిన్నెసోటాలో జులై 19న ‘మాటా’ బోనాలు & వన భోజనాలు కార్యక్రమం
MATA: మిన్నెసోటా ఏరియా తెలుగు అసోసియేషన్ (MATA) ఆధ్వర్యంలో ‘బోనాలు & వన భోజనాలు’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుక జులై 19, 2026, ఆదివారం రోజు బ్లూమింగ్టన్లోని హైలాండ్ లేక్ పార్క్ రిజర్వ్ (సన్నీసైడ్ పిక్నిక్ ఏరియా)లో ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరుగుతుంది.
ఈ కార్యక్రమ ప్రత్యేకతలు..
ఈ వేడుకలో భాగంగా ‘సేవా’ (SEWA) హెల్త్ వాలంటీర్లు పాల్గొని ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహిస్తారు.
అక్కడ రక్తపోటు (BP) పరీక్షలు , రక్తంలో చక్కెర (Blood Glucose) స్థాయిలను పరీక్షించే సౌకర్యం ఉంటుంది.
వైద్యులతో సంప్రదింపులు, తక్కువ ధరలో ఆరోగ్య సేవలకు రిఫరల్స్, ఉచిత మాస్కులు, శానిటైజర్ల పంపిణీ , గిఫ్ట్ గివ్-అవేలు వంటివి అందుబాటులో ఉంటాయి.
తెలుగు సంస్కృతిని ప్రతిబింబించే బోనాల పండుగను వన భోజనాలతో పాటు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలతో కలిపి నిర్వహించడం విశేషం.








