చార్లెట్ వేదికగా జులై 17న TTA యూత్ బ్యాంక్వెట్
TTA: అమెరికాలోని చార్లెట్ వేదికగా జరగనున్న ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) మెగా కన్వెన్షన్ – 2026’లో భాగంగా, 14 నుండి 25 ఏళ్ల వయస్సు గల యువతీ యువకుల కోసం ప్రత్యేకంగా ‘యూత్ బ్యాంక్వెట్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ మెగా కన్వెన్షన్ జులై 17 నుండి 19, 2026 వరకు జరగనుంది, అందులో భాగంగా ఈ బ్యాంక్వెట్ కార్యక్రమం జూలై 17న నిర్వహిస్తున్నారు.
కార్యక్రమ వేదిక..
ఈ కార్యక్రమం చార్లెట్లోని ప్రతిష్టాత్మకమైన ‘NASCAR హాల్ ఆఫ్ ఫేమ్’లో (400 E. M.L.K, JR. Blvd, Charlotte, NC 28202) జరగనుంది. యువత ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడానికి (Meet & Connect), DJ డాన్సింగ్, రుచికరమైన విందు, ఉత్తేజకరమైన ఆటలు (Games) , మధుర జ్ఞాపకాలను దాచుకోవడానికి ఫోటో సెషన్స్ వంటివి ఏర్పాటు చేశారు. పాల్గొనే యువత ‘ఇండో-వెస్ట్రన్’ (Indo-Western) లేదా ‘వెస్ట్రన్ కాక్టెయిల్’ (Western Cocktail Attire) దుస్తులు ధరించాలని నిర్వాహకులు సూచించారు.








