డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను పరామర్శించిన గవర్నర్
కుడి భుజానికి శస్త్ర చికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ (Abdul Nazeer) పరామర్శించారు. గురువారం హైదరాబాద్ లోని పవన్ నివాసానికి వెళ్లి పవన్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ కల్యాణ్ స్వగృహంలో ఉన్న లైబ్రరీ (library)ని ఆయన తిలకించారు. ప్రఖ్యాత రచయితలు, స్కాలర్స్, విశ్లేషకులు, పబ్లిక్ పాలసీ మేకర్స్ రాసిన పుస్తకాలను పరిశీలించారు. వాటి గురించి పవన్ కల్యాణ్ తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కోరడంతో ఓ పుస్తకంపై ఆయన ఆటోగ్రాఫ్ (Autograph) చేశారు. గవర్నర్ నజీర్ ఎంతో ఆప్యాయతతో వచ్చి పరామర్శించినందుకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు.








