బికినీలో షాలినీ గ్లామర్ ట్రీట్
అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన షాలినీ పాండే మొదటి సినిమాతోనే యువతలో ప్రత్యేకమైన క్రేజ్‌ను సంపాదించుకుంది. విజయ్ దేవరకొండతో ఆమె కెమిస్ట్రీ, నేచురల్ యాక్టింగ్ ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత వరుసగా తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించినప్పటికీ కెరీర్లో ఆశించిన స్థాయిలో స్టార్డమ్ మాత్రం దక్కలేదు. మంచి అవకాశాలు వచ్చినా, పెద్ద సక్సెస్‌లు వరుసగా రాకపోవడంతో టాప్ హీరోయిన్ల లిస్ట్ లో చోటు దక్కించుకోలేకపోయింది. అయినా సోషల్ మీడియాలో మాత్రం షాలినీ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ ట్రావెల్, ఫిట్నెస్, గ్లామర్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో దిగిన ఓ స్టైలిష్ ఫోటోను షేర్ చేయగా, ఆమె నేచురల్ లుక్, క్యూట్ ఎక్స్ప్రెషన్, గ్లామరస్ స్టైల్ అభిమానులను మరోసారి ఫిదా చేస్తున్నాయి.








