బోడె రామచంద్ర యాదవ్ చేతులమీదుగా “వెంకట్రామయ్య గారి తాలూకా” అడుకున్నదిక్కడే’ పాటను విడుదల
సతీష్ అవ్వాల దర్శకత్వంలో దినేష్ కుమార్, దివిజా ప్రభాకర్ జంటగా రూపొందుతున్న “వెంకట్రామయ్య గారి తాలూకా” చిత్రం నుంచి “అడుకున్నదిక్కడే” అనే లిరికల్ సాంగ్‌ను భారత చైతన్య యువజన పార్టీ (BCY) జాతీయ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్ ఘనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్‌కు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తూ, సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సతీష్ అవ్వాల మాట్లాడుతూ, తమ సినిమాలోని “అడుకున్నదిక్కడే” పాటను విడుదల చేసిన బోడె రామచంద్ర యాదవ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రేక్షకులను అలరించే వినోదంతో పాటు హృదయాలను తాకే భావోద్వేగాలతో ఈ చిత్రం రూపొందుతోందని చెప్పారు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభించిందని, త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నామని వెల్లడించారు.
హీరో దినేష్ కుమార్ మాట్లాడుతూ, “అడుకున్నదిక్కడే” పాటకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు. హీరోయిన్ దివిజా ప్రభాకర్ మాట్లాడుతూ, ఈ చిత్రంలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉందని, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని అన్నారు.
పాట విడుదల కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, ఆహ్వానితులు పాల్గొని చిత్ర విజయం సాధించాలని ఆకాంక్షించారు.








