జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
అమరావతిలోని వెంకటపాలెంలో జగన్నాథ రథయాత్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. రథం లాగేముందు జగన్నాథ స్వామికి ప్రత్యేక పూజులు నిర్వహించి బంగారు చీపురుతో మార్గాన్ని ఊడ్చి శుభ్రం చేశారు. అనంతరం జగన్నాథుని రథాన్ని తాడుతో లాగారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మంత్రి నారాయణ గారు, ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ గారు, పలువురు ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.









