అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్, డైరెక్టర్ ప్రియదర్శన్ మోస్ట్ అవేటెడ్ థ్రిల్లర్ “హైవాన్” సినిమా ఫస్ట్ లుక్
-సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్ రూపొందిస్తున్న సినిమా “హైవాన్”. సరికొత్త థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ ప్రెస్టీజియస్ మూవీతో ఫస్ట్ టైమ్ నెగిటివ్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు అక్షయ్ కుమార్. “హైవాన్” సినిమా సెప్టెంబర్ 11న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వచ్చేందుకు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్స్ ఇంటెన్స్ లుక్స్ తో ఆకట్టుకుంటున్నాయి.
ప్రియదర్శన్ శైలిలో సాగే ఒక యూనిక్ థ్రిల్లర్ గా “హైవాన్” సినిమా ఉండబోతున్నట్లు ఈ ఫస్ట్ లుక్ ద్వారా తెలుస్తోంది. ఈ చిత్రంతో డైరెక్టర్ ప్రియదర్శన్ ప్రేక్షకుల్ని ఒక డార్క్, థ్రిల్లింగ్ వరల్డ్ లోకి తీసుకెళ్లనున్నారు. ఈ ఏడాది ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీస్ లో “హైవాన్” ముందు వరుసలో నిలుస్తోంది. ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో బొమన్ ఇరానీ, సయామీ ఖేర్, శ్రియ పిల్గాంకర్ నటిస్తున్నారు. హైవాన్ మూవీతో అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ 17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుండటం విశేషం. హైవాన్ చిత్రాన్ని టాప్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు నిర్మాతలు వెంకట్ కె నారాయణ, శైలజా దేశాయ్ ఫెన్.








