‘హే చికీతా’ చిత్రంతో అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు
అమరావతి మూవీ మేకర్స్, సుందరకాండ మోషన్ పిక్చర్స్ బ్యానర్ల మీద ఎన్. అశోక ఆర్ఎన్ఎస్, ‘గరుడవేగ’ అంజి నిర్మించిన చిత్రం ‘హే చికీతా’. అభినవ్ మణికంఠ, దివిజ ప్రభాకర్, తన్మయ్ ఖుషి, దేవి ప్రసాద్, ఈటీవీ ప్రభాకర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీని ధనరాజ్ లెక్కల తెరకెక్కించారు. ఈ సినిమాని జూలై 24న రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో ఈ మూవీ నుంచి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్, సాంగ్స్ ఇలా అన్నీ కూడా ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. శుక్రవారం నాడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చదలవాడ శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, కమెడియన్ అలీ, వీఎన్ ఆదిత్య, ప్రసన్న కుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో..
చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ .. ‘నేను యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ‘లైలా’ మూవీని చేశాను. ఆడియో రైట్స్‌తోనే ఎంతో లాభం వచ్చింది. ‘హే చికీతా’ టీంని చూస్తే నాకు పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఎన్నో జన్మల పుణ్యం చేస్తే గానీ నిర్మాతగానో, ఆర్టిస్టుగానో, టెక్నీషియన్ గానో ఇండస్ట్రీలోకి రాలేం. ‘హే చికీతా’ విషయంలో ఆర్టిస్టులు అంతా బాగా నటించారు. అంజి కెమెరా వర్క్ బాగుంది. దర్శకుడు, నిర్మాత ఇలా అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. చిన్న సినిమాతో హిట్ కొడితే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు. ఇలాంటి చిత్రాలకు మీడియా అండగా నిలబడాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
కమెడియన్ అలీ మాట్లాడుతూ .. ‘‘బద్రి’ సినిమాలోని ‘హే చికీతా’ పాట ఎంత పెద్ద హిట్ అయిందో ఈ సినిమా కూడా అంతే హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఓ చిత్రాన్ని తీయడం, రిలీజ్ చేయడం ఎంత కష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సినిమాలో విషయం ఉంటే.. ప్రేక్షక దేవుళ్లే నెత్తిన పెట్టుకుని మోస్తారు. భవిష్యత్తులో రైతు అనేవాడు ఉంటాడా? కనిపిస్తాడా? అని అనిపిస్తుంది. రైతు ఉంటేనే దేశం నిలబడుతుంది. రైతు మీద, యువత మీద తీసిన ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలి. ‘హే చికీతా’ టీంకి ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ ఈవెంట్‌కి వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. చదలవాడ శ్రీనివాసరావు గారి నిర్ణయం వల్ల మా దర్శకుల సంఘం నుంచి సినిమాలు రాబోతోన్నాయి. అన్ని క్రాఫ్టులకు పని దొరికేలా చేసిన ఆయనకు థాంక్స్. ‘హే చికీతా’ మంచి విజయం సాధించాలి. ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ మంచి పేరు రావాలి. చరణ్ అర్జున్ మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అంజితో నాకు ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ధన్ రాజ్ లెక్కలకు దర్శకుడిగా మంచి పేరు రావాలి’ అని అన్నారు.
తుమ్మలపల్లి రామ సత్యనారాయణ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన చదలవాడ శ్రీనివాసరావు గారికి థాంక్స్. ఎవరికి కష్టం వచ్చిందో తెలుసుకుని మరీ సాయం చేస్తారాయన. ‘హే చికీతా’ మంచి హిట్ అవుతుంది. అంజి మంచి మూవీని నిర్మించారు. కెమెరామెన్‌గా, నిర్మాతగా అంజి గొప్ప సినిమాని తీశారు. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ .. ‘చదలవాడ శ్రీనివాసరావు గారు చేస్తున్న మంచి పనుల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఇక్కడకు వచ్చిన ఈ చిత్రయూనిట్‌ను అభినందిస్తుండటం ఆనందంగా ఉంది. ‘హే చికీతా’ టైటిల్ బాగుంది. థియేటర్లు నిండటం సహజం. కానీ ఈ రోజు ఇక్కడ స్టేజ్ నిండిపోయింది. వీళ్లంతా ప్రేమతోనే ఇక్కడకు వచ్చారు. రైతే రాజు అనే క్యాప్షన్‌తో వస్తోన్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.
రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ మాట్లాడుతూ .. ‘‘పల్లెటూరులో చాలా ప్రేమ కథలుంటాయి. ‘హే చికీతా’ పోస్టర్ని చూస్తే మా ఊర్లో ఉన్న రోజులు గుర్తుకు వచ్చాయి. రైతు పంట పండిస్తేనే మనం ఇలా జీవిస్తున్నాం. రైతే రాజు అనే కాన్సెప్ట్‌తో రాబోతోన్న ఈ చిత్రం మంచి విజయం దక్కాలి’ అని అన్నారు.
జి. నాగేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ మూవీని ఆల్రెడీ చూశాను. ఫస్ట్ హాఫ్ అంతా నవ్వుతారు. సెకండాఫ్ అంతా ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్ చూసి కంటతడి పెట్టుకుంటారు. అభినవ్, దివిజ, తన్మయ్ అద్బుతంగా నటించారు. ‘హే చికీతా’లో గొప్ప సందేశం ఉంటుంది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుంది’ అని అన్నారు.
గరుడవేగ అంజి మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ మూవీని జూలై 24న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం. మళ్లీ సక్సెస్ మీట్లో కలుసుకుందాం. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత ఎన్. అశోక ఆర్ఎన్ఎస్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ కోసం వచ్చిన గెస్టులందరికీ థాంక్స్. ధన్ రాజ్ చెప్పిన కథ నాకెంతో నచ్చింది. అంజి గారితో కలిసి సినిమాని చేయడం ఆనందంగా ఉంది. చరణ్ అర్జున్ గారి పాటలు అద్బుతంగా ఉన్నాయి. జూలై 24న మా సినిమా రాబోతోంది. అందరూ చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దర్శకుడు ధన్ రాజ్ లెక్కల మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ ఈవెంట్ కోసం వచ్చిన అతిథులందరికీ థాంక్స్. ఇది నా తొలి చిత్రం. చాలా మంచి సినిమా చేశాను. రైతులు, యూత్ కోసం ఈ మూవీని చేశాను. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన అంజి అన్నకి, అశోక అన్నక థాంక్స్. అంజి మామ, అజయ్ పాత్రలు అందరినీ నవ్విస్తాయి. యోధ పాత్ర గురించి సక్సెస్ మీట్లో మాట్లాడతాను. అభినవ్, దివిజ, తన్మయ్, దేవి ప్రసాద్ గారు నాకెంతో సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ అన్న వల్లే నేను ఇక్కడ నిలబడగలిగాను. మా సినిమాకి మీడియా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
అభినవ్ మణికంఠ మాట్లాడుతూ .. ‘చరణ్ అర్జున్ అన్న వల్లే నాకు ‘హే చికీతా’లో అవకాశం వచ్చింది. ఈ జర్నీలో నాకు సపోర్ట్ చేసిన ధన్ రాజ్ అన్నకి, అంజి అన్నకి, అశోక అన్నకి థాంక్స్. దివిజ, తన్మయ్‌లతో నటించడం ఆనందంగా ఉంది. జూలై 24న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
దివిజ ప్రభాకర్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ ఈవెంట్ కోసం వచ్చిన అందరికీ థాంక్స్. చిట్టి అనే పాత్రను నాకు ఇచ్చిన దర్శకుడు ధన్ రాజ్ గారికి థాంక్స్. ప్రతీ క్షణం సినిమా బెటర్మెంట్ కోసమే ఆలోచిస్తుంటారు. అంజి గారు మా అందరినీ ముందుండి నడిపించారు. అశోక్ గారు ఎక్కడా వెనుకాడకుండా సపోర్ట్ చేశారు. చరణ్ అర్జున్ గారి మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అభినవ్‌తో పని చేయడం ఆనందంగా ఉంది. జూలై 24న థియేటర్లోకి ‘హే చికీతా’ వస్తోంది. అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అందరూ కలిసి మా సినిమాని చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.
నటి తన్మయ్ ఖుషి మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’లో నేను పొట్టి అనే పాత్రను పోషించాను. బావను పిచ్చిగా ప్రేమించే ఈ పాత్రను అందరూ ప్రేమిస్తారు. నా కారెక్టర్‌తో ప్రతీ ఒక్కరూ కనెక్ట్ అవుతారు. నాకు మంచి పాత్రను ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. జూలై 24న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను’ అని అన్నారు.
చరణ్ అర్జున్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ సినిమాలో అద్బుతమైన సాహిత్యం అందించిన లిరిసిస్ట్స్కి థాంక్స్. ఈ మూవీ క్రెడిట్ అంతా దర్శకుడిదే. ధన్ రాజ్ అద్భుతమైన కథను రాసుకున్నారు. ఆయన్ను నమ్మి డబ్బులు పెట్టిన నిర్మాతలు అశోక్ గారు, అంజి గారికి హ్యాట్సాఫ్. నాకోసం పాటలు పాడిన అందరికీ థాంక్స్. జూలై 24న ఈ చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
దేవి ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘హే చికీతా’ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నాకు ఇందులో మంచి పాత్రను ఇచ్చిన ధన్ రాజ్ గారు, అంజి గారు, అశోక్ గారికి థాంక్స్. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. కూతురు వ్యవసాయాన్ని ముందుకు తీసుకు వెళ్లడం, లెగసీ కంటిన్యూ చేసే సీన్ చూసి, అందులో యోధ నటన చూసి నాకు గూస్ బంప్స్ వచ్చాయి. ధన్ రాజ్ గారు మంచి కథను రాసుకున్నారు. ఈ మూవీకి అంజి గారు, చరణ్ అర్జున్ గారు మెయిన్ పిల్లర్స్. ఈ చిత్రంతో అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
నటి యోధ మాట్లాడుతూ .. ‘ధన్ రాజ్ అన్న వల్లే నాకు ‘హే చికీతా’లో అవకాశం వచ్చింది. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ధన్ రాజ్ అన్న, నిర్మాత అంజి అన్న, అశోక్ అన్నకి థాంక్స్. జూలై 24న మా సినిమాని చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.








