బ్యాడ్మింటన్ కోర్టులో కృష్ణవి మెరుపులు.. ఒకే టోర్నీలో మూడు పతకాలతో సత్తా
అట్లాంటాకు చెందిన కృష్ణవి కాసు అనే తెలుగు బాలిక, అమెరికాలో జరిగిన ప్రతిష్టాత్మక ‘2026 యోనెక్స్ యూఎస్ జూనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్’లో అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంది. జూలై 8 నుండి 14 వరకు కాన్సాస్ రాష్ట్రంలోని విచిటా నగరంలో ఈ క్రీడా పోటీలు జరిగాయి.
స్వర్ణ పతకం: అండర్-13 బాలికల సింగిల్స్ విభాగంలో ప్రత్యర్థులపై గెలుపొంది, నేషనల్ ఛాంపియన్గా నిలిచింది.
రజత పతకం: అండర్-13 బాలికల డబుల్స్ విభాగంలో కృష్ణవి రజత పతకాన్ని దక్కించుకుంది.
అండర్-13 మిక్స్డ్ డబుల్స్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచి, ఒకే టోర్నమెంట్లో మూడు విభాగాల్లో విశేష ప్రతిభ కనబర్చి తన సత్తా చాటింది.








